రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి వాపులు చూసి బలుపు అనుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక ఆటో బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

బిజెపి చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిపోయిందని ఆరోపించారు. దేశం నుంచి బిజెపి పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news