మంత్రి తలసాని ఓ సినిమా యాక్టర్ లా వ్యవహరిస్తున్నారు – బండి సంజయ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ సినిమా యాక్టర్ లా వ్యవహరిస్తున్నారని అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో రేపు జరగబోయే గణేష్ నిమర్జనోత్సవాల సందర్భంగా వీడ్కోలు వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసిన పోరాటం వల్లే గణేష్ నిమర్జనానికి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

హిందూ సమాజం ఐక్యతను చాటే వినాయక చవితి వేడుకలను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హిందువులంతా సంఘటితమైతే, కెసిఆర్ ఆటలు సాగవున్న కుట్రతోనే గణేష్ నిమర్జనానికి ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నికార్సైన హిందువు అయితే.. ఇంత పెద్ద వినాయక నిమర్జనం ఏర్పాట్లపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.