మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అని వయసు పెరిగే కొద్ది మనకే తెలుస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు పలకరించే..చుట్టూ నలుగురు ఉంటారు. కానీ వయసు మీద పడే కొద్ది..ఒంటరితనం తోడవుతుంది. తిన్నావా అని అడిగే వాళ్లు కూడా కరువైపోతారు. పిల్లలు ఉద్యోగాలకోసమో, చదువులకోసమో.. ఎక్కడో.. మీరు ఒంటరిగా ఇక్కడ..!చాలా విరక్తిగా అనిపిస్తుంది. ఎవరైనా తోడుగా ఉంటే బాగుండూ అనిపిస్తుంది. అలాంటి వారికి నేనున్నా అంటున్నాడు ఆ వ్యక్తి..కేవలం తోడుగా ఉంటాడంతే.. ఉన్నంత సేపు పైసలు ఇవ్వాలి.. ఏ పని చేయకుండా.. గంటకు రూ.. 5 వేలు పైనే వసూలు చేస్తున్నాడు. ఏం కర్మరా బాబు.. నాలుగు మాట్లాడటానికి..కూడా డబ్బులిచ్చి పిలిపించుకోవాల్సి వస్తుంది..
అతడి పేరు షోజీ మోరిమోటో. ఉండేది జపాన్ రాజధాని టోక్యోలో. లాంకీ బిల్డ్, యావరేజ్ లుక్‌తో ఉండే మోరిమోటో ఇప్పుడు ట్విట్టర్లో దాదాపు పావు మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.. గతంలో తను ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ, తనకు ఆ ఉద్యోగం పెద్దగా నచ్చలేదు. కష్టంతో కూడిన పని చేయడం ఇష్టంలేదు. అందుకే కష్టపడకుండా డబ్బులు సంపాదిండం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. చివరకు ఓ ఐడియా వచ్చింది.
ఒంటరిగా ఉండే వారికి తోడుగా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. నెమ్మదిగా అతడి గురించి జనాలకు తెలిసిపోయింది. ఒంటరిగా ఉండే వాళ్లు సరదాగా బయటకు వెళ్లేందుకు అతడిని తోడు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. వారితో గడిపేందుకు మోరిమోటో గంటకు 10,000 యెన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5,600 వసూలు చేస్తున్నాడు.
ఏ పని చెప్పకూడదు..
తనను చాలా మంది అద్దెకు తీసుకెళ్తారట..వారితో పాటు గడిపేందుకు వెళ్తాడు అంతే… వారు ఏ పని చెప్పకూడదనేని రూల్. గత నాలుగు సంవత్సరాలలో అతడు దాదాపు 4,000 మందికి తోడుగా వెళ్లాడు. వారిలో నాలుగింట ఒక వంతు మంది రిపీట్ క్లయింట్స్” అని మోరిమోటో అంటున్నాడు..
జపాన్ లోనే
మోరిమోటో కేవలం జపాన్ లోని క్లయింట్స్ వెంటే వెళ్తాడు. ఇతర దేశాల నుంచి ఆఫర్లు వచ్చినా తను వాటిని తిరస్కరించాడు. లైంగిక స్వభావం కలిగిన ఎలాంటి రిక్వెస్ట్‌ను తను ఒప్పుకోడట.. ఇతరులతో బయటకు వెళ్లడమే మోరిమోటో ఏకైక ఆదాయ వనరు. ఇలా సంపాదించిన డబ్బుతో అతడు తన భార్య , బిడ్డకు పోషించుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల అతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పలేదు. కానీ.. రోజుకు ఒకరు, లేదంటే ఇద్దరితో బయటకు వెళ్తానని చెప్పాడు. కరోనాకు ముందు రోజుకు ముగ్గురు లేదంటే నలుగురితో బయటకు వెళ్లేవాడినని చెప్పాడు.