గవర్నర్ తమిళిసై ని కలిసిన ఎమ్మెల్యే సీతక్క

-

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సైని కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని ఆరోపించారు. విభజన హామీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని.. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క.

మేడారం పర్యటనకు వచ్చిన సందర్భంలో గవర్నర్కు ఈ విషయం గురించి వివరించానని.. మరో మారు తమిళసై దృష్టికి తీసుకువెళ్లినట్లుు చెప్పుకొచ్చారు. 8 ఏళ్లు గడిచినప్పటికీ విశ్వవిద్యాలయం ముందుకు వెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. విశ్వవిద్యాలయం పూర్తి అయితే పర్యటక రంగంలో ములుగు ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news