ఫామ్​హౌస్ కేసు.. సిట్ ఎదుటకు ప్రతాప్ గౌడ్, చిత్రలేఖ

-

మొయినాబాద్ ఫామ్​హౌస్​లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఇద్దరికీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయవాది ప్రతాప్ గౌడ్ నందకుమార్‌తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు కలిసి ప్రయాణించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రామచంద్రభారతి మొబైల్ ఫోన్లలో డేటా సేకరించారు.

సింహయాజీ, రామచంద్రభారతితో ఉన్న సంబంధాలపై సిట్‌ అధికారులు ప్రతాప్‌ గౌడ్‌ను ప్రశ్నిస్తున్నారు. వాళ్లతో పరిచయాలపై ఆరా తీస్తున్నారు. నందకుమార్‌ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను విచారిస్తున్నారు. సిట్ నోటీసులపై ప్రతాప్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని సిట్ అధికారులను ఆదేశించింది. నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి కూడా జరిగినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news