ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ… ఆ రోజున రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్న మోదీ.. ఆ తర్వాత రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, రూ. 7,864 కోట్లతో నిర్మించే 6 హైవేలు, రూ.1,366 కోట్లతో చేపట్టే బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులను ప్రారంభించి, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొంటారు.
కాగా.. తెలంగాణలో ఏ పార్టీతోను పొత్తులు ఉండవని, బిజెపి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తామని రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వామపక్షాలు ఏకమవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే 12 ST అసెంబ్లీ నియోజకవర్గం వర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.