రేవంత్ రెడ్డితో సినీ నటుడు అలీ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం ఎదురైంది. తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆలీ అలీ సమావేశం అయ్యారు. నిన్న రాత్రి సమయంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన తో సమావేశం అయ్యారు.

అయితే.. తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో ఆలీ ఎందుకు సమావేశం అయ్యేరో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ.. వీరి ఫోటో ఒకటి వైరల్‌ గా మారింది. కాగా.. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని కలిశారు. ఆలీ గవర్నర్ తమిళి ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్‌ రెడ్డిని కలిశారు అలీ.