నేడు నీరా కేఫ్‌ని ప్రారంభించనున్న కేటీఆర్‌

-

గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా.. కల్లుకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి.. పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘నీరా కేఫ్‌’కు అంకురార్పణ చేసింది. రూ.20 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ తీరంలో దీన్ని నిర్మించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ ఈ కేఫ్ ను ప్రారంభించనున్నారు.

ఈ స్టాల్ విశేషాలేంటంటే..

నెక్లెస్‌ రోడ్డులో 2020 జులై 23న దీనికి శంకుస్థాపన చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. రెస్టారెంట్‌ తరహాలో తీర్చిదిద్దారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫుడ్‌ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరా విక్రయిస్తారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ధి చేసి, ఇక్కడ విక్రయిస్తారు. నీరాతో తయారు చేసిన ఉప ఉత్పత్తులూ అందుబాటులో ఉంటాయి. మొత్తం ఏడు స్టాళ్లు ఉంటాయి. ఒకేసారి 300 – 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి వచ్చేలా నిర్మించారు. కేఫ్‌ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news