గత పది రోజులుగా వరణుడు రాష్ట్రాన్ని వణికిస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలతో ప్రజలను అతలాకుతలం చేస్తున్నాడు. ఇక జిల్లాల్లో వడగండ్ల వాన కురిపిస్తూ కర్షకులకు కడగండ్లు మిగులుస్తున్నాడు. ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బుధ, గురు, శుక్రవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది.
రాష్ట్రంలో బుధ, గురు, శుక్రవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. మరోవైపు సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు వనపర్తి జిల్లా ఆత్మకూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా పెబ్బేరు 7, వీపనగండ్ల 6, కామారెడ్డిలో 5, నిజామాబాద్ జిల్లా నవీపేటలో 5 సెం.మీ. చొప్పున వర్షాలు కురిశాయి.