ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఏ చర్చ జరగలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ శాఖలు ఖాళీగా లేవని.. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు. జీవన్‌రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని అయితే, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయెద్దని హెచ్చరించారు.
మరోవైపు కేసీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం కేసీఆర్ కు గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీ, రైతుభరోసా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల సమస్యలపై సమర్యాసంగా పరిష్కరించుకుంటామన్నారు. విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాధించలేదని పేర్కొన్నారు.