కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో విజయాలకు, అబద్దాలకు మధ్య పోటీ ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అమాయకులు కాదని.. అన్నీ గమనిస్తున్నారని అన్నారు. పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరని తెలిపారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని ఆరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఢిల్లీ నుండి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ బయలుదేరారని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగే కురుక్షేత్రంలో కాంగ్రెస్ అబద్ధాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాలకు పోటీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ వంద అబద్ధాలు ఆడినా గెలిచేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు హరీష్ రావు. తెలంగాణ అభివృద్ధిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసి నేర్చుకుంటున్నారని తెలిపార…