బండి సంజయ్ కి నోటీస్.. రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్

-

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరచినందుకు బీజేపీ నేతలు రాణిరుద్రమ,దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో ఏర్పాటుచేసిన” అమరుల యాది”లో అనే సభలో కెసిఆర్ ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా చేసిన స్కిట్ విషయంలో రాణి రుద్రమ, దరువు ఎల్లన్న ని హయత్ నగర్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

- Advertisement -

అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్దరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అదే రోజు బెయిల్ పై జిట్టా బాలకృష్ణ విడుదలయ్యారు. బండి సంజయ్ కి 41a సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. కాగా ఈ అరెస్టులపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...