టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ప్రవీణ్‌ను కస్టడీకి తీసుకోని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల చరవాణి నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు.
పలువురు మహిళలతో ప్రవీణ్‌కు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి మొబైల్లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు.