నిమజ్జనంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొన్నం

-

నిమజ్జనంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి  మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం జరిగే గణేష్ నిమజ్జనం కోసం అన్నీ ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని తెలిపారు. నిమజ్జన సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ కలిసి వీటిని ప్రశాంతంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

నిమజ్జన సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లను పరిశీలించింది. 17న జరిగే నిమజ్జనం దృష్ట్యా ఇక్కడ ఏర్పాట్ల పై ఆరా తీశారు. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. ప్రతీ ఏడాది మాదిరిగానే నిమజ్జనానికి అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. సాయంత్రం లోపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామన్నారు. భక్తులు తెచ్చిన పీవోపీ విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. నిమజ్జన ఉత్సవాలు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్సవ సమితి తెలిపింది. 

Read more RELATED
Recommended to you

Latest news