రూ.10వేల కోట్ల రుణం.. ఆ భూముల తాకట్టు ఆపాలి : కేటీఆర్

-

నగరంలో ఐటీ,దాని అనుబంధ పరిశ్రమల కోసం ఉద్దేశించిన 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి రేవంత్ సర్కార్ ట్రై చేయడం ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. నగరం చుట్టుపక్కల ఐటీ, దాని అనుబంధ పరిశ్రమలు వచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన జరగాలని కోరారు. అంతేకానీ,ఈ భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరో ట్వీట్‌లో కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయిందంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.పంటల సాగులో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి అనతికాలంలోనే ఎదిగామని ఆనందపడ్డామని, దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతన్న దేశం కడుపు నింపే ఎత్తుకు ఎదిగాడని గర్వపడ్డామని, ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల బతుకులు వ్యవసాయ విప్లవంతో బాగుపడ్డాయని సంబరపడ్డామని, కానీ కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయ్యిందని విమర్శించార. పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news