నిజాం షుగర్ ఫ్యాక్టరి సమస్యని మా ప్రభుత్వం పరిస్కరించింది : సీఎం రేవంత్ రెడ్డి

-

నిజాం షుగర్ ఫ్యాక్టరి సమస్యని మా ప్రభుత్వం పరిస్కరించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు.  క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం అభినందన సభలో మాట్లాడారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక రాజు గారి చేతిలో ఉంది. మా ప్రభుత్వం పరిష్కరించి షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాంగ్రెస్ అభివృద్ధికి క్షత్రియుల కృషి ఉందన్నారు. క్షత్రియులు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించారు. క్షత్రియులను ప్రతినిధులను మా పార్టీలో పెట్టదలుచుకున్నారో.. వారిని లీడర్లుగా చేసి వారికి అవకాశం కల్పిస్తానని మాట ఇస్తున్నానని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను కల్పించి ఉద్యోగాలు అందిస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్పూర్తి, దండకారణ్య వీరుడు కొమురం భీమ్ స్పూర్తితో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు ప్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టండి అని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news