మాది మాటలతో కాదు.. చేతలతో చేసి చూపించే ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని విమర్శించారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటేడ్ పాఠశాలలకు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పథకం కింద రూ.657 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. డీఎస్సీ ద్వారా ఇప్పటికే 11వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం స్కూళ్లు పెట్టిందే తప్ప వసతులు కల్పించడంలో విఫలం చెందిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని తెలిపారు.