కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని..! : పాయల్ శంకర్

-

కవితకు సుప్రీం కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ అలాగే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట నడిచిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అంటూ కామెంట్స్ చేసారు ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్.

సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను బండి సంజయ్ వ్యతిరేకించలేదు అని చెప్పిన ఆయన.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయాన్ని బండి సంజయ్ బహిర్గతం చేశారు అని అన్నారు. అలాగే కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించింది నిజం కాదా.. కవిత బెయిల్ కోసం వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెట్టింది అని తెలిపారు. అలాగే రాజ్యసభ అభ్యర్ధిగా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ ఎందుకు వేయలేదు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. స్వయం ప్రకటిత మేధావి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు మెదడు ఉండే మాట్లాడుతున్నారా అని పేర్కొన MLA శంకర్.. బండి సంజయ్ ట్వీట్ చేసిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news