ఈనెల తొమ్మిదవ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ – చైనా మధ్య ఘర్షణ పై పార్లమెంట్ వేదికగా తీవ్ర రాజకీయ దుమారం చెల్లరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కేంద్రంలోని బిజెపి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ పై పార్లమెంటులో చర్చకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు అసదుద్దీన్.
సరిహద్దుల్లో భారత సైన్యం బలంగా ఉందని.. కానీ వారికి మద్దతుగా నిలవడంలో కేంద్రం బలహీనంగా ఉందని విమర్శించారు. చైనా సైన్యం భారత భూభాగంలోకి వచ్చినా.. ఎవరూ రాలేదంటూ దేశ ప్రజలను ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చైనా సైనికులు దేప్సాంగ్, డెంచోకులను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాలు రుదువు చేస్తున్నాయని ఓవైసీ ఆరోపించారు. చైనాను చూసి మోడీ భయపడుతున్నారని విమర్శించారు అసదుద్దీన్ ఓవైసీ.