పార్టీ మారే విషయం పై క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి లో పొంగులేటి మాట్లాడుతూ..టిఆర్ఎస్ మెడలు వంచామన్న బీజేపీ నాయకుల మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు అని అన్నారు.ఎవరి తృప్తి కోసం వాళ్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వి అహంకారపూరితమైన మాటలు అని అన్నారు.బిజెపి అంత పట్టుదల పోవాల్సిన అవసరం లేదని..వాళ్లే నష్టపోతారని చెప్పారు.ప్రతి ఏటా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది అన్నారు .ఈనెల 16వ తేదీన మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు.
తన ఇంటికి భోజనానికి రావాలని పొంగులేటి కోరడంతో మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు.మంత్రి భోజన ఏర్పాట్లను మాజీ ఎంపీ వర్గీయులు భారీ స్థాయిలో చేపడుతున్నారు.2014లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం జిల్లా ఎంపీగా గెలుపొందిన పొంగులేటి ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు.2019లో ఆయనకు టికెట్ దక్కలేదు.అప్పటి నుంచి ఒంటరిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న పొంగులేటి బిజెపిలోబీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది.ఈ ప్రచారాన్ని మాజీ ఎంపీ ఖండించారు.తాను ఏ పార్టీలో కి వెళ్లట్లేదు అని..టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.అస్తమానం పార్టీ మారుతూ ఉంటామా అని అన్నారు.