కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి, జూపల్లి..?

-

సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార బీఆర్ఎస్ పార్టీ. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న…సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై సస్పెండ్ వేటు వేసింది బీఆర్ఎస్ పార్టీ. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సస్పెండ్ చేసింది కెసిఆర్ పార్టీ.

అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయడం పై స్పందించారు మాజీ ఎంపీ పొంగులేటి.. తనని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనవరి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని.. 100 రోజుల తర్వాత అయినా బిఆర్ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకొని తనని సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటేనే.. సీఎం మాటలు నమ్మి టిఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించకపోయినప్పటికీ కేటీఆర్ మాటలు నమ్మి ఇన్నాళ్లుగా ఆ పార్టీలో కొనసాగానని చెప్పుకొచ్చారు పొంగులేటి.

దొరల గడీల నుంచి విముక్తి లభించినందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ పెద్దలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. గతంలో నిరంజన్ రెడ్డి తన చేతిలో ఓడిపోయారని… డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని సవాల్ విసిరారు జూపల్లి. కారణం చెప్పకుండా ఎందుకు సస్పెండ్ చేశారో వివరించాలని కోరారు. అయితే వీరిద్దరూ ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే వీరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ఇరువురు నేతలు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news