Praja Palana : ‘ప్రజాపాలన’కు 1.25 కోట్ల దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. 8 రోజుల్లో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. రూ.2500 ఆర్థికసాయం, రూ.500కు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ళకు అత్యధికమంది అప్లై చేసుకున్నారు.
కొత్త రేషన్ కార్డులకు భారీగానే వినతులు వచ్చాయి. అప్లికేషన్లను ఈనెల 17 నాటికి కంప్యూటరైజ్డ్ చేస్తారు. గ్రామసభల్లో ఆర్జీలు ఇవ్వలేకపోయినవారు MRO, MPDO ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం,రేషన్ కార్డులు, రూ.500కే సిలిండర్,రూ.5లక్షల యువ వికాసం,రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా,రూ.4వేల పింఛన్లు, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 సాయం, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా.. మిగిలిన గ్యారెంటీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది.