రేపటి నుంచి రైతుబంధు డబ్బులు – మంత్రి తుమ్మల

-

రేపటి నుంచి రైతుబంధు డబ్బులు జమ అవుతాయని ప్రకటన చేశారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తాజాగా రైతుబంధు నిధుల విడుదల పై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. ఈ సంధర్బంగా అధికారులు ఇప్పటి వరకు 40% శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని అనగా 27 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలోకి రైతుబంధు జమ చేయడం జరిగిందని తెలిపారు మంత్రి తుమ్మల.

rythu-bandhu

వరి, ఇతర యాసంగి పంటల నాట్లు, సాగు ముమ్మరంగా తెలంగాణ రాష్ట్రావ్యాప్తంగా జరుగుతునందున త్వరతిగతిన రైతుబంధు సొమ్ము జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు. రోజు వారిగా నిధులు విడుదల జరిగేలా చూడాలని, రేపటి నుంచే అధిక సంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వం యొక్క అత్యున్నత ప్రాధాన్యత అని, గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతు బంధును రైతులకు సకాలంలో అందచేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news