వివాదంలో ప్రకాష్ జవదేకర్…సాక్సులతో దేవాలయంలోకి !

-

 

 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్ వివాదంలో చిక్కుకున్నారు. సాక్సులతో వేములవాడ గుడిలోకి ప్రవేశించారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్. నిన్న వేముల వాడలో పర్యటించారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్. ఈ సందర్భంగా సాక్సులతో వేములవాడ గుడిలోకి ప్రవేశించారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. దీనిపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. తప్పు ఎవరు చేసినా… తప్పేనని వాధిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, BJP పార్టీకి అభ్యర్థులు కరువైయ్యారని తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వేములవాడలో సీనియర్ బిజెపి కార్యకర్తల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మరోసారి నోరు జారారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. ఇదంతా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముందే అనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news