తెలంగాణలో ఎంటర్ అయిన ప్రశాంత్ కిషోర్.. తీన్మార్ మల్లన్నసంచలన పోస్ట్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పేరు తెలియని వారు ఉండరు. ఒంటిచేత్తో, తనదైన వ్యూహాలతో ఎన్నో రాష్ట్రాల్లో… చాలా పార్టీలు అధికారంలోకి తీసుకు వచ్చాడు ప్రశాంత్ కిషోర్. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి… కారణం ప్రశాంత్ కిషోర్. తనదైన వ్యూహాలతో రెండు స్థానాల్లో ఉన్న బీజేపీని… అధికారంలోకి తీసుకు వచ్చాడు.

ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్, తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ కు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి కి పని చేశారు ప్రశాంత్ కిషోర్. కోట్లలో డబ్బులు తీసుకుంటూ… పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తారు ప్రశాంత్ కిషోర్. అయితే… వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తారని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

అయితే… టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంపై బహిర్గతంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియా అలాగే.. టీవీ ఛానల్ లో దీనిపై అనేక వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో తీన్మార్ మల్లన్న ఒక సంచలన పోస్ట్ చేశాడు. ప్రశాంత్ కిషోర్ అలాగే ప్రకాష్ రాజ్ కాలేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్లిన ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు మల్లన్న. టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ కర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడు అనే సంకేతం వచ్చేలా ఈ ట్వీట్ చేశాడు తీన్మార్ మల్లన్న. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.