తన కు బండి సంజయ్ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తమ మధ్య పోటీ లేదు పోలిక లేదు… అఘాదం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోర్ లీడర్ ఇవ్వాల్సింది పార్లమెంటరీ పార్టీ బండి సంజయ్ కాదని.. పార్టీ లో అభిప్రాయ బేధాలు వుండడం సహజం, ఆత్మాభిమానం కోసమే తప్ప పార్టీని కకా వికలం చేయాలనే ఆలోచన ఎవరికి లేదని తేల్చి చెప్పారు.
పార్టీ ప్రోటోకాల్ విషయం లో సంఘటన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను.. పరిష్కరిస్తారని అనుకుంటున్నానని వెల్లడించారు. హరీష్ రావు తో కలిసి చాలా వేదికలలో ఉన్నాను.. ఇద్దరిది ఒకే జిల్లా అని వివరించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దగ్గర అయ్యానని అనడం దుర్మార్గమని.. అధికారంలోకి వచ్చేది బీజేపీ అని….. మునుగుతున్న నావా టీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. తాను బీజేపీ లోనే ఉంటాను…నా ఎదుగుదల నచ్చక దుష్ప్రచారం చేస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొంటానని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.