రాహుల్ జోడో యాత్ర తెలంగాణలో హిస్టరీ క్రియేట్ చేస్తుంది : ఎంపీ ఉత్తమ్

-

మునుగోడు ఉపఎన్నికలో.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గేదేలే అంటూ కాంగ్రెస్ బరిలో దిగుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ జోడో యాత్రతో తెలంగాణలోనూ తమ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఉత్తమ్ కొనియాడారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసే సమయంలో అనేక వర్గాలను రాహుల్ కలుస్తారని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న జోడో యాత్ర ఈనెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి సమస్యపై రాహుల్ చర్చిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు.

తెలంగాణలో రాహుల్‌ను యాత్రలో కలిసేందుకు అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు సంప్రదిస్తున్నట్లు మధు యాస్కీ పేర్కొన్నారు. మద్యం, డబ్బు ప్రభావంతో గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని ప్రలోభాలకు లొంగరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news