హైదరాబాద్ ప్రజలకు చల్లటి కబురు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం ఉన్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ఎండాకాలంలో విపరీతమైన ఉడకపోతతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మేఘాలు కరుణించాయి. ఇవాళ ఉదయం నుంచి ఆకాశం మొత్తం మేఘావృతమైంది.

దీంతో కాసేపటి నుంచి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, బర్కత్పురా, కార్వాన్, సికింద్రాబాద్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. మరికాసేపట్లోనే హైదరాబాద్ నగరవ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది.