హైదరాబాద్ లో కొత్తగా 9,000 ఉద్యోగాల నియామకం – KTR

-

నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లో కొత్తగా 9,000 ఉద్యోగాల నియామకం చేయనున్నట్లు KTR ప్రకటించారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కంపెనీ Alliant Group హైదరబాద్ లో కొత్తగా 9,000 ఉద్యోగాల నియామకం కు నిర్ణయం తీసుకుందని వివరించారు.

ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్ మరియు కోర్ ఐటి టెక్నాలజీలలో యువతకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. అలాగే మంత్రి కేటీఆర్‌ మరో కీలక ప్రకటన కూడా చేశారు. TechnipFMC ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం హైదరాబాద్‌ను తమ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ & ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రంగా ఎంచుకుందని వివరించారు. 1,250 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను TechnipFMC ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news