ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన సీబీఐ అరెస్ట్ పై కవిత వేసిన బెయిల్ పిటిషన్ తీర్పు ను రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 02వ తేదీకి రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్ట్ లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీరపు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా.. సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఆమె తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎలాంటి మెటీరియల్ లేదు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. పార్టీకి స్టార్ క్యాంపెయినర్.. ప్రతిపక్షంలో ఉన్నాం. రూలింగ్ లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయాం.. చిదంబరం జడ్జిమెంట్ లో కవిత విషయంలో సరిపోతుంది. ఏడేళ్ల లోపు పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదు. అరెస్ట్ కి సరైన కారణాలు లేవని కవిత తరపున వాదనలు వినిపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news