రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యుడని…. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్‌రెడ్డి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందునే ఆయన అపార్థం చేసుకున్నట్లు చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డిని సొంత పార్టీని ముంచేందుకు యత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి…. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్టుల గురించి తేల్చేందుకే చండూరుకు వస్తున్నామన్న రేవంత్….. నిజాయితీపరుడైతే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
“కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరు… రాజగోపాల్‌రెడ్డి వేరు. రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీకి ద్రోహం చేశాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు. నా కంటే సీనియర్ నేత… తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ద్రోహి. నా వ్యాఖ్యలకు వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధంలేదు. రాజగోపాల్‌రెడ్డిని మాత్రమే మీరు అని సంభోదించాను. నాకు, వెంకట్‌రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టిస్తున్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరంలేదు. రాజగోపాల్‌రెడ్డి సవాళ్లకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. టెండర్లు, కేసీఆర్‌పై పోరాటంపై చండూరుకు వచ్చి మాట్లాడుతా.” అని రేవంత్ రాజ్‌గోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.