తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే.. ఈ ఎపిసోడ్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పెద్ద తప్పు చేశారు..అతని ముఖం కూడా చూడనని నిప్పులు చెరిగారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. నన్ను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నం చేశారని.. ఆయన్ను కాంగ్రెసులో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. రేవంత్ పెద్ద తప్పు చేశారని.. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడు వెళ్తానని కుండ బద్దలు కొట్టి చెప్పారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.