రాహుల్ పై చర్యలు.. అప్రకటిత ఎమర్జెన్సీనే – రేవంత్ రెడ్డి

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడగా.. రెండేళ్ల జైలుశిక్షతో ఎంపీగా అనర్హత వేటు వేసింది లోక్‌ సభ. ఇక ఈ అంశంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఇది దుర్మార్గమని… ఆధాని పై చర్చ జరుగకుండా బీజేపీ చూస్తుందని ఫైర్‌ అయ్యారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీఅని విమర్శలు చేశారు. నియంతలు కాలగర్భంలో కలిశారు…మధ్య యుగ కాల చక్రవర్తి అనుకుంటున్నాడని మోడీపై మండిపడ్డారు.

ఇలాంటి విపరీత పోకడ ప్రజా స్వామ్యం కి మంచిది కాదు…. కోర్టు వేసిన శిక్ష కి 30 రోజులు గడువు ఉంది…. గడువు లేకుంటే జైల్ కె తీసుకుపోయే వాళ్ళు కదా అని నిలదీశారు. ప్రజా స్వామ్య వాదులు ఆలోచన చేయండని… రాహుల్ గాంధీకి దేశం అండగా ఉంటుందన్నారు. పగ తో పరిపాలన చేస్తున్నారని… పాదయాత్ర తో మోడీ వైఫల్యాలను రాహుల్ గాంధీ..జనం ముందు పెట్టారని నిప్పులు చెరిగారు. సంస్థల స్వతంత్రత కోల్పోతే నష్టమని.. న్యాయం చేస్తున్నట్టు ప్రజలకు అనిపించాలన్నారు. కోర్టు వ్యవహారం పార్లమెంట్ లో మాట్లాడతామని చెప్పారు రేవంత్‌ రెడ్డి.