పుస్తెల తాడు అమ్మేలా చేసిన దౌర్భాగ్యుడు కేసీఆర్: రేవంత్ రెడ్డి

-

టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ గ్రామంలో గ్రామంలో చేసిన డెవలప్మెంట్ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో శాంతమ్మ అనే మహిళా సర్పంచ్ తన పుస్తెలు అమ్మి వడ్డీ కట్టానని అధికారులను నిలదీసింది. బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని అధికారులను నిలదీసింది. గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలకు రూ. 25 లక్షలు ఖర్చు చేశామని.. ఇందులో రూ. 20 లక్షలు ప్రైవేటు వ్యక్తులను అప్పు తెచ్చినట్లుగా వారికి వడ్డీలు చెల్లిస్తున్నట్లుగా తన బాధను అధికారుల ముందు వ్యక్తం చేసింది. 

అయితే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు పుస్తెల తాడు ప్రాణ సమానం అని.. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితిని కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం శాంతమ్మ దీనగాథ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version