వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

-

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విధితమే. ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు, పార్టీ నేతలు కూడా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ తో పాటు మరికొందరు నేతలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.   నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానని తెలిపారు వంశీ కృష్ణ. జిల్లాలో నేనే సీనియర్ ను అని.. అంతేకాదు పార్టీకి విధేయుడిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి లక్ష మంది వస్తారని అంచనా వేశారు. మేము పని చేయకపోతే ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగల లేఖ విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...