సెక్యూరిటీ గార్డులకు కూర్చునే హక్కు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులు, పోర్త్ క్లాస్ ఉద్యోగులు, హోంగార్డులకు సిట్ టూ రైట్ (కూర్చునే హక్కు) పై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోర్త్ క్లాస్ ఉద్యోగులు రోజుకు దాదాపు 10 నుంచి 12 గంటల వరకు నిలబడే తమ విధులను నిర్వహిస్తారని.. ఈ విషయంలో వారికి ఉపశమనం కలిగేవిధంగా పనివేళలో వారికి కూర్చునే హక్కు కల్పించాలనే ప్రతిపాదనపై సీఎం రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం ఈ విధానం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అమలు అవుతున్నందునా.. అక్కడ ఉన్న విధివిధానాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం స్పందనతో లక్షలాది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పని వేళలో కనీసం కూర్చొవడానికి కూడా అనుమతి లేక కుటుంబ పోషణ కోసం గంటల తరబడి నిల్చొవాల్సిన పరిస్థితులున్నాయి. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే తమ బాధలకు విముక్తి కలుగుతుందనే సంతోషం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news