మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ కు ఉంగరం గుర్తు కేటాయింపు

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతూ ఉంటే, బిజెపి తరఫున కేంద్ర నేతలు ప్రచారానికి వస్తున్నారు. అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రులు సీనియర్ లీడర్లు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తులు కేటాయించారు. ఈ తరుణంలోనే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు సైతం గుర్తు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ మునుగోడు ఉప ఎన్నికలలో కేఏ పాల్ కు ఉంగరం గుర్తును కేటాయించారు.

కాగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాశాంతి పార్టీని, ఆ పార్టీ గుర్తింపును తొలగించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొదట ప్రజా గాయకుడు గద్దర్ ను నామినేషన్ వేయించాలనుకున్న కేఏ పాల్.. ఆ తర్వాత తానే వేస్తానని ప్రకటించేశాడు. కాగా నవంబర్ మూడో తేదీన ఈ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news