రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ పదవీకి గణపతి రెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంచనా పెంపు పై సీరియస్ గా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంచనాల పెంపు పై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ కు అందజేశారు. 2017లోనే గణపతి రెడ్డి రిటైర్ మెంట్ అయినప్పటికీ.. గత ఏడేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ సైతం ఈఎన్సీ గా 9 నెలలుగా గణపతి రెడ్డినే కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బాధ్యతలను గణపతి రెడ్డినే సూచిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు ఎన్ హెచ్ కేటాయింపు.. కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. ప్రధానంగా గణపతిరెడ్డి ఆధ్వర్యంలోనే నూతన సెక్రెటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్, జిల్లాల కలెక్టరేట్లరు, సచివాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం వంటి వాటికి నిర్మాణం జరిగింది.