ఈ నెల 18న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో., రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

అయితే.. ఈ కీలక సమావేశంలో.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.