75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా టిఎస్ ఆర్టీసీలో వేడుకలను ప్రారంభించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ప్రయాణికులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు సజ్జనార్. మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులంతా అమృత ఉత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారని తెలిపారు.
అంతేకాదు 75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ 12 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇక 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఆగస్టు 16 నుంచి 21 తేదీ వరకు రూ. 75 తగ్గించింది.