పెద్దల సభను వెంకయ్యనాయుడు ఎంతో హుందాగా నడిపారు: విజయసాయిరెడ్డి

-

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు సభలో ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో మన తెలుగు వ్యక్తి కూర్చోవడం ఉభయ సభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని తెలిపారు విజయసాయిరెడ్డి. పెద్దల సభను వెంకయ్య నాయుడు ఎంతో హుందాగా నడిపారని కొనియాడారు విజయసాయిరెడ్డి. వెంకయ్యనాయుడు సొంత జిల్లా నెల్లూరుకు చెందిన వ్యక్తిని కావడం తనకు గర్వకారణమన్నారు విజయసాయిరెడ్డి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో వెంకయ్యకు ఉన్న పరిజ్ఞానం చాలా గొప్పదని అన్నారు విజయసాయిరెడ్డి. రాజ్యసభలో పాత, కొత్త అనే తేడా లేకుండా సభ్యులందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించారని ప్రశంసించారు విజయసాయిరెడ్డి. అనేక సభల్లో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజలనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేశాయని అన్నారు విజయసాయిరెడ్డి.

TDP trying to enter into an alliance with BJP: YSR Cong leader Vijayasai  Reddy | Deccan Herald

విద్యార్థి దశలో తాను కూడా ప్రభావితమయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆరేళ్ల క్రితం తాను రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు చివరి వరుసలో కూర్చున్నానని… అప్పుడు తనకు మాట్లాడే అవకాశం వస్తుందో, రాదో అని సంశయిస్తున్న సమయంలో… అంతమందిలో తనను గుర్తించి మాట్లాడే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370పై ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్న సమయంలో… ప్రాంతీయ పార్టీలకు సైతం మాట్లాడేందుకు అవకాశాన్ని ఇవ్వడం వెంకయ్య గొప్పదనానికి నిదర్శనమన్నారు విజయసాయిరెడ్డి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు ఆయన అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు విజయసాయిరెడ్డి. వైస్ ఛైర్మన్ ప్యానల్ గా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నిర్వహించే అవకాశాన్ని తనకు కల్పించడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని, వెంకయ్యనాయుడు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news