Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్

-

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు కు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావును సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సుబ్బారావు తో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బిసి రెడ్డి లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నేడు రైల్వే కోర్టులో హాజరు పరిచారు.

వాదనలు విన్న రైల్వే న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సుబ్బారావు తో పాటు అతని అనుచరులను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నలుగురిపై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.వాట్స్అప్ గ్రూపులు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించే విధంగా ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను సుబ్బారావు తారుమారు చేశారని అన్నారు.

విధ్వంసానికి ముందు రోజు నరసరావుపేట నుండి సుబ్బారావు హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. బోడుప్పల్ లోని ఎస్విఎమ్ గ్రాండ్ లాడ్జి లో ఉండి విధ్వంసాన్ని టీవీలో చూసి సుబ్బారావు సంతృప్తి పొందినట్టు పోలీసులు తెలిపారు. అనుచరులు పంపిన వాట్సాప్ గ్రూపు మెసేజ్లను డిలీట్ చేయమని, అనంతరం గ్రూపులో నుండి ఎగ్జిట్ అవమని సుబ్బారావు సూచించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news