సంచలనం: నిజాం రిజర్వ్ బ్యాంక్ ని కేసీఆర్ కొల్లగొట్టారా?

-

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారం రాజకీయంగానూ, సామాజికంగానూ సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జ్ఞాపకాలను చెరపొద్దని ఒకరంటే.. సెక్షన్ – 8 అమలు చేయాలని మరొకరన్నారు.. ఈ విషయాన్ని గుప్తనిధుల వేటలో భాగంగా మరొకరు చూస్తున్నారు! ఇందులో భాగంగా… సచివాలయం కూల్చివేతను కేసీఆర్ అర్ధరాత్రి సమయంలోనే ఎందుకు ప్రారంభించాడో తాను చెబుతాను అంటూ ముందుకు వచ్చారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి!

సచివాలయం కూల్చివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అందుకు ఆయన చెప్పిన విషయం “ఆపరేషన్ జీ బ్లాక్”! అవును… “ఆపరేషన్ జీ బ్లాక్” వెనుక భారీ ఆర్థిక దోపిడీకి కుట్ర జరిగిందని.. “జీ బ్లాక్” కింద భూగర్భంలోని రహస్యాలు నిగ్గు తేలాల్సి ఉందని.. అందులో భాగంగా పురావస్తు శాఖ అధికారులకు అప్పగించి పరిశోధన సాగించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయంలోని జీ బ్లాక్ గురించి వివరించడం మొదలుపెట్టిన రేవంత్… ఈ బ్లాక్ ను 1888లో ఆరో నిజాం నవాబ్ అలీఖాన్ నిర్మించారని.. దీనిని “సైఫాబాద్ ప్యాలెస్” అని పిలిచేవారని.. ఆనాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు ఈ బ్లాక్లోనే జరిగేవనీ.. “నిజాం రిజర్వ్ బ్యాంక్” గా జీ బ్లాక్ ఉండేదని.. దీని కింద సొరంగాలు బయటపడ్డాయని.. తద్వారా జీ బ్లాక్ కింద “నిజాం నిధి” కచ్చితంగా ఉందన్న సంకేతాలు కనిపించాయని.. ఆ వేలకోట్ల నిధిని కొల్లగొట్టడానికే అర్ధరాత్రి పూటా సచివాలయం కూల్చివేత ముహూర్తం పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్!

కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసీఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారని.. సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదని.. ఇదంతా నిజాం నిధికి సంబందించిన వేల కోట్ల సొమ్మును దోచేసే పథకంలో భాగమని రేవంత్ ఆరోపిస్తున్నారు! ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ “జీ బ్లాక్” వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది!

Read more RELATED
Recommended to you

Latest news