ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..!

-

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం రిమాండ్ విధించింది. అలాగే ఈడీ కస్టడీకి సైతం అనుమతించింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. ‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవ, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చారు. లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు.

రామచంద్ర పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీతో కవిత వాటా పొందారు. కవితకు రామచంద్ర పిళ్లై బినామీగా ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది. ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది. ఈ రూ.30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. స్టేట్ మెంట్ రికార్డు చేసే సమయంలో కవిత అసంబద్ధ సమాధానాలు చెప్పారు. సాక్ష్యాలను ధ్వసం చేశారు.’ అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news