మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? : కేటీఆర్ కు షర్మిల కౌంటర్

-

మంత్రి కేటీఆర్‌ కు వైఎస్ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు షర్మిల. నిన్న వేముల వాడలో బీజేపీకి సవాల్‌ విసురుతూ.. కేటీఆర్‌ రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు. ఆ వ్యాఖ్యలు ఇవాళ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా? రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తలేరని రాజీనామా చేస్తారా? అని నిలదీశారు షర్మిల.

రైతు బీమా రైతులందరికి అందిస్తలేరని రాజీనామా చేస్తారా? కౌలు రైతును రైతుగానే గుర్తిస్తలేరని… రాజీనామా చేస్తారా? నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? అని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? పేద విధ్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? అని మండిపడ్డారు. మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి. రాష్ట్రం రావణకాష్టం కావాలి.అంతే కదా మీ అద్భుత పాలన? అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news