మహిళలపై హోం మంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సహనం, ఓపిక ఎక్కువే అంటూ ఆయన పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజలో మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్త్రీలకు సహనం, ఓపిక ఎక్కువ అని.. కేసీఆర్ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా పంచాయతీ, మునిస్పల్ లలో 50 శాతం రిజ్వేషన్లను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. దేశంలో స్వాతంత్య్రం తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలు కేటాయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.
తెలంగాణ వచ్చాక మహిళలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని.. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష్లను ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచామని.. దేశంలో క్లీన్ సిటీ హైదరాబాద్ అన్నారు. మహిళ దినోత్సవం అంటే ఒక్క రోజు కాదు అన్ని రోజులు మహిళలవేనని చెప్పారు.