కేటీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..మీ అహంకార గోచి ఊడపీకేయడం ఖాయం !

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పై వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ అహంకార గోచి ఊడపీకేయడం ఖాయం అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. నిన్న నాగర్‌ కర్నూల్‌ లో కేటీఆర్‌ పర్యటించారు.

అయితే.. ఈ సందర్భంగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. దొర గారి కుటుంబానికి పైసల పిచ్చి. దోచేస్తున్నారు.. జనాన్ని గిచ్చి గిచ్చి. బుద్ధి రాదు మీకు.. ఛీ ఛీ.. ఈ సారి ఓట్లేస్తారు జనం ఆచి తూచి…ఊడపీకుతారు మీ అహంకార గోచి. తగలపెడతారు మీ నియంత పాలనకు చితిపేర్చి అంటూ ఓ రేంజ్‌ లో విమర్శలు చేశారు వైఎస్‌ షర్మిల.