కెసిఆర్ ఢిల్లీ పర్యటనపై షర్మిల సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సెటైర్లు వేశారు.”దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు, చేతులు కాలాక ఆకులు పట్టుకొనుడు ఇది కేసీఆర్ పాలన తీరు. ఓవైపు వర్షాలతో మూసి ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నా, ఏటా వర్షాలకు ఇదే పరిస్థితి ఉన్నా, ముందస్తు చర్యలు ఉండవు.

వరదలు వచ్చినప్పుడు, జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే మూసి పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామని చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవు. వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సహాయక చర్యలు పర్యవేక్షించాల్సింది పోయి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నడు దొర. రాష్ట్రంలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోతే మీకెందుకు, జనం చస్తే మీకెందుకు, మీకు మీ రాజకీయాలు ముఖ్యం”. అంటూ పేర్కొన్నారు వైయస్ షర్మిల.