కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వెళతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే.. మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి ను ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. ఈ వార్తలపై స్వయంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.
మునుగోడు లో పోటీ పై పార్టీ నాతో ఎవరు మాట్లాడలేదని… సీఎం కెసిఆర్ నాతో మాట్లాడితే చెప్తానని స్పష్టం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నేను మండలి చైర్మన్ పదవీ లో సంతృప్తిగా ఉన్నానని.. సర్వే లు బీజేపీ పుంజుకున్నా …టీఆర్ఎస్దే అధికారం అని చెప్పాయని వెల్లడించారు. కేంద్రం పై సీఎం గట్టిగా మాట్లాడినా, అన్ పార్లమెంటరీ మాట్లాడబోరని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మునుగోడు లో పోటీ పై మాట్లాడను… ఏ కారణంతో రాజగోపాల్ రాజీనామా చేస్తున్నారని నిలదీశారు. గట్టుప్పల్ మండల ఏర్పాటు ఎప్పుడో నిర్ణయించారన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.