తెలంగాణ మందుబాబులకు షాక్ తగిలింది. జూన్ 4న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సీపీ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 4న ఉదయం 6 గంటల నుంచి.. 5 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలపై తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఇక అటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు సిబ్బంది ఓట్ల లెక్కింపు పనిలో పడిపోయారు. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి.